మహారాణిపేట: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి 6 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 91.90 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఈ సందర్భంగా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పెదజాలరిపేటలోని లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఏడీసీ సత్యవేణి, మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. కాగా.. జిల్లాలో సిటీ, రూరల్ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1,57,914 మంది పింఛన్ దారులు ఉండగా, వీరి కోసం ప్రభుత్వం రూ.69.47 కోట్లు విడుదల చేసింది. తొలి రోజు 1,45,121 మందికి రూ.63.58 కోట్లను సచివాలయ సిబ్బంది అందజేశారు. మిగిలిన వారికి శనివారం పంపిణీ కొనసాగుతుందని డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి తెలిపారు.


