విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం తమ అమూల్యమైన భూములను దానంగా ఇచ్చిన దాతల విగ్రహాలను ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయాలి. వర్సిటీ ఉద్యోగులకు రెండు నెలల బోనస్, విద్యార్థులకు మూడు నెలల మెస్ బిల్లు మాఫీ ప్రకటించాలి. కొద్దిమందికే ఈ ఉత్సవాలు పరిమితం కావడం దారుణం. ఇప్పటికై నా విద్యార్థి సంఘాలు బలోపేతమై, ఏకతాటిపైకి రావాలి. వర్సిటీలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– జి.ఎ.నారాయణరావు,
రాష్ట్ర ఎడ్యుకేషన్ కౌన్సిల్ పూర్వ సభ్యుడు


