వైఎస్‌ జగన్‌తో వాసుపల్లి భేటీ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తో వాసుపల్లి భేటీ

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

డాబాగార్డెన్స్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీవారి పంచలోహ విగ్రహాన్ని అందజేశారు. నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన కేడర్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు. నియోజకవర్గంలో ఓటీపీ వెరిఫికేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, ఆ డేటాను కూడా త్వరలోనే కేంద్ర కార్యాలయానికి అందజేస్తామని వాసుపల్లి అధినేతకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement