ఆనందపురం: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సిరి వెంకటేశ్వర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 24వ వెంచర్‌ను ఆనందపురం మండలం చందక పంచాయతీలోని జగన్నాథపురంలో ప్రారంభించింది. ‘నందనవనం సౌభాగ్య’పేరుతో రూపొందించిన ఈ నూతన లేఅవుట్‌కు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కె.రాజు మంగళవారం భూమి పూజ నిర్వహించి, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ.. విశాఖ నగర శివారు ప్రాంతాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆనందపురం సమీపంలో ఈ వెంచర్ ఉండటం వల్ల పెట్టుబడిదారులకు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తర్లువాడలో రానున్న గూగుల్ సిటీకి, ఐటీబీపీ అకాడమీకి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆనందపురం ఐటీ సెజ్‌కు కేవలం 100 మీటర్ల చేరువలోనూ ఈ వెంచర్ ఉందని వివరించారు. ప్రస్తుతం ఉన్న 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును 60 అడుగుల రోడ్డుగా విస్తరించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో త్వరలోనే ఇళ్ల స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడే అవకాశం ఉందని, వినియోగదారులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బంక సత్యం, కంపెనీ మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.


