విశాఖ లీగల్ : జిల్లా కోర్టులో ఈనెల 10న జరగనున్న న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పదవులకు పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాదులు తమ మేనిఫెస్టోను ప్రకటిస్తూ ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా తమ వంతు చేయూతనిస్తామని, జూనియర్ న్యాయవాదులకు శిక్షణ, చట్టాలు, కోర్టు నియమావళి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానంగా అధ్యక్ష పదవికి నమ్మి సన్యాసిరావు, శిష్టల శ్రీనివాసమూర్తి, ఎంఎస్ మాధవ్, కార్యదర్శి పదవికి వి.గోవిందరావు, విఎస్‌ఎ రవీంద్రనాథ్, ఎ.వెంకట సోమేశ్వరరావు, వి.వెంకట సుధాకర్ పోటీలో ఉన్నారు.


