పన్నుల వసూళ్ల్లలో విశాఖ టాప్‌ | - | Sakshi
Sakshi News home page

పన్నుల వసూళ్ల్లలో విశాఖ టాప్‌

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

ఆరిలోవ: వాణిజ్య పన్నుల శాఖ విశాఖపట్నం డివిజన్‌–1 మార్చి నెలలో అన్ని రకాల పన్నుల వసూళ్లు రాష్ట్రంలోనే అత్యధికంగా జరిగినట్లు ఆ శాఖ సంయుక్త కమిషనర్‌ పి.బి.వల్లి తెలిపారు. విశాఖ డివిజన్‌–1 పరిధిలో భీమిలి, చినవాల్తేరు, డాబాగార్డెన్స్‌, ద్వారకానగర్‌, కురుపాం మార్కెట్‌, సిరిపురం, సూర్యాబాగ్‌ సర్కిళ్లతో పాటు ఒక ప్రత్యేక సర్కిల్‌ ఉన్నాయన్నారు. జీఎస్టీ, నెలవారీ రిటర్న్‌ ఫైలింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్షన్‌ ప్లాన్‌, పాత బకాయిల వసూళ్లు ద్వారా ఈ ఏడాది మార్చి నెలలో రూ.158.59 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని తెలిపారు. గత ఏడాది మార్చి(2025)లో రూ.150.71 కోట్లు లభించిందన్నారు. డివిజన్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.1,733.59 కోట్లు కాగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement