‘టౌన్‌ ప్లానింగ్‌’పై ఫిర్యాదుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

‘టౌన్‌ ప్లానింగ్‌’పై ఫిర్యాదుల వెల్లువ

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 95 వినతులు

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు 95 వినతులు అందాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్‌ వర్మ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 95 వినతుల్లో అత్యధికంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే టౌన్‌ ప్లానింగ్‌కు 52, రెవెన్యూ సెక్షన్‌కు 13, ఇంజినీరింగ్‌ విభాగానికి 11, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అకౌంట్స్‌కు 6, హార్టికల్చర్‌ 1, ఇతర ఫిర్యాదులు 12 వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ పి.నల్లనయ్య, జాయింట్‌ డైరెక్టర్‌(అమృత్‌) డి.విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్‌ కుమార్‌, సీసీపీ ప్రభాకరరావు, సెక్రటరీ బీవీ రమణ, ఏడీహెచ్‌ వాసుకి, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ ఇ.ఎ.రాజు, ఆర్‌ఎఫ్‌వో కృపావరం, యూసీడీ పీవో పి.ప్రసన్నవాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement