అక్రమ మద్యాన్ని నివారించాలి
విశాఖ సిటీ: ఉత్తరాంధ్రలో అక్రమ మద్యాన్ని పూర్తిగా నివారించాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎకై ్సజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం వీఎంఆర్‌డీఏ భవన్‌లో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయంలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలని చెప్పారు. నాటు సారా, కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


