నిరుద్యోగ సమస్యలపై డీవైఎఫ్‌ఐ నిరసన | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ సమస్యలపై డీవైఎఫ్‌ఐ నిరసన

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

మహారాణిపేట: నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందించాలని, 20 నెలలు దాటినా ఇప్పటికీ హామీ నెరవేరలేదని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యు.ఎస్‌.ఎన్‌. రాజు విమర్శించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె. మహేష్‌ కోరారు. కార్యక్రమంలో ఉపాద్యక్షుడు ఎస్‌.శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement