కొమ్మాది: విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 60వ బ్రాంచ్‌ను ఎండాడలో సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడు తూ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 59 శాఖలను కలిగి ఉందని, ఎండాడ బ్రాంచ్‌తో 60కి చేరిందన్నారు. రూ.8,300 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో నడుస్తున్న బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాన్ని రూ.8,600 కోట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు జి.జనార్దనరావు, సీహెచ్ ఆదినారాయణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


