గీతం ఆక్రమిత భూములను రెగ్యులర్‌ చేయవద్దు | - | Sakshi
Sakshi News home page

గీతం ఆక్రమిత భూములను రెగ్యులర్‌ చేయవద్దు

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

కలక్టర్‌కు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌

ప్రతినిధి పాకా వినతి

అల్లిపురం: గీతం విశ్వవిద్యాలయం ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్‌ చేయవద్దని, ఆ భూములను స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి పాకా సత్యనారాయణ సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. భీమిలి మండలం రుషికొండ పరిధిలోని సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించిందని, దానిని రెగ్యులరైజ్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు తమకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ భూములను గతంలో భూమి లేని పేదల జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ యాక్ట్‌–1977 ప్రకారం, కేటాయించిన భూములను కొనడం, అమ్మడం పూర్తిగా నిషేధమని, ఈ చట్టం విరుద్ధంగా జరిగిన లావాదేవీలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. గీతం యాజమాన్యం చేసుకున్న రెగ్యులరైజేషన్‌ దరఖాస్తును తిరస్కరించి, ఆ భూములను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement