ముగిసిన మార్షల్ ఆర్ట్స్ పోటీలు
పరవాడ: గొర్లెవానిపాలెం ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి థంగ్–టా(మార్షల్ ఆర్ట్స్) పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 22 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి కె.ఎం.నాయుడు తెలిపారు. ముగింపు సమావేశంలో ఎస్జీఎఫ్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.ఎం.నాయుడు మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో, సజావుగా పోటీలు నిర్వహించడానికి సహకరించిన అనకాపల్లి డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, పరవాడ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, అనకాపల్లి ఉప విద్యాశాఖాధికారి పొన్నాడ అప్పారావు, ఎంఈవో దివాకర్‌రావు, రాష్ట్ర పరిశీలకుడు శ్రీహరిరాజు, ఏవీడీ ప్రసాద్, నిర్వహణ కమిటీ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ పోటీలకు ఎంపికై ంది వీరే..
అండర్–14 బాలుర విభాగం: వివిధ బరువుల విభాగాల్లో షణ్ముఖ సాత్విక్ (విశాఖ), వి.సాత్విక్ (కృష్ణా), జె.హరీష్ (విశాఖ), ఎస్.కె.అయాన్ (విజయనగరం), వై.మోక్షిత్ (కృష్ణా), పి.ఎస్.ఎస్.రిత్విక్ (తూర్పు గోదావరి)
బాలికల విభాగం: వివిధ బరువుల విభాగాల్లో ప్రణీత (విశాఖ), అమీర్ ఇరాన్ (కర్నూలు), సుధీక్ష (తూర్పు గోదావరి), తులసి (విశాఖ), త్రివేణి (విశాఖ), మేఘన (విశాఖ)
అండర్–17 బాలుర విభాగం: పవన్‌కుమార్ (విశాఖ), సి.హెచ్.చరణ్‌తేజ (విశాఖ), కె.ఆకాష్ (విజయనగరం), జాన్‌పాల్ (గుంటూరు)
బాలికల విభాగం: సాయి రజని (విశాఖ), ధాన్సీ (విజయనగరం), మణికర్ణిక (కృష్ణా), ప్రవల్లిక (విశాఖ), డి.హర్షిణి (విశాఖ), సుహానా (కర్నూలు)
అండర్–19 బాలుర విభాగం: పి.వినయ్‌కుమార్ (విజయనగరం), అఖిల్ (గుంటూరు), చెన్నకేశవ (వైఎస్సార్ కడప), వెంకటేష్ (విజయనగరం), రోహిత్ (విజయనగరం), లక్ష్మీ ప్రణీత్ (కృష్ణా)
బాలికల విభాగం: సుల్తానా (కర్నూలు), శ్రీహిత (విజయనగరం), శ్రీలత (గుంటూరు), మానస (విశాఖ), జ్యోతి (విశాఖ), సురేఖ (కర్నూలు)
ముగిసిన మార్షల్ ఆర్ట్స్ పోటీలు


