● రూల్స్ పెట్టినోళ్లే.. ఇరుక్కుపోయారు!
నిబంధనలు అమలు చేయాల్సిన పోలీసులే.. ఆ నిబంధనలను అతిక్రమించారు. భారీ వాహనాలు రాకుండా పోలీస్ శాఖ నౌరోజీ రోడ్డులో ఇనుప గడ్డర్ ఏర్పాటు చేసింది. విషయం తెలిసినా.. ఆదివారం నోవాటెల్ వైపు నుంచి నగరంలోకి వచ్చేందుకు ఓ పోలీస్ వ్యాన్ డ్రైవర్ నౌరోజీ రోడ్డును ఎంచుకున్నారు. అజాగ్రత్తగా వ్యవహరించిన ఆయన.. వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో అది కాస్త ఆ ఇనుప గడ్డర్ కింద ఇరుక్కుపోయింది. దీంతో చేసేదేం లేక పోలీసులు టైర్లలో గాలి తీస్తూ, ఇనుప రాడ్ ఎత్తి పట్టుకుంటూ నానా తంటాలు పడ్డారు. మొత్తానికి అతికష్టం మీద వాహనాన్ని బయటకు తీశారు. మరోవైపు.. ఇదే మార్గంలో వచ్చిన పర్యాటకుల వాహనం కూడా లగేజీ కారణంగా ఇదే రాడ్ కింద చిక్కుకుపోయింది. వ్యాన్‌ను తప్పించేందుకు నానా అవస్థలు పడ్డారు. – డాబాగార్డెన్స్
● రూల్స్ పెట్టినోళ్లే.. ఇరుక్కుపోయారు!


