విజయోత్సాహంతో.. తిరుగు ప్రయాణం
ప్రత్యేక విమానంలో భువనేశ్వర్
తరలివెళ్లిన క్రికెటర్లు
గోపాలపట్నం: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై సాధించిన ఘన విజయంతో టీమిండియా తదుపరి పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో విజయఢంకా మోగించిన భారత జట్టు.. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి బయలుదేరింది. కటక్‌లో ఈ నెల 9న జరగనున్న టీ–20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు పయనమయ్యాయి. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.


