పలు రైళ్లకు అదనపు కోచ్‌లు | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

Dec 3 2025 7:19 AM | Updated on Dec 3 2025 7:19 AM

పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

తాటిచెట్లపాలెం: పండగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లకు ఆయా తేదీల్లో అదనపు కోచ్‌లను జతచేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌ తెలిపారు.

● విశాఖలో ఈ నెల 7, 14, 21, 28వ తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు (08581) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌కు, తిరుగు ప్రయాణంలో ఎస్‌ఎంవీ బెంగళూరులో ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో బయల్దేరే ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08582) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఒక థర్డ్‌ ఏసీ ఎకానమి కోచ్‌ను జతచేస్తున్నారు.

● విశాఖలో ఈ నెల 3, 10, 17, 24, 31వ తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం– తిరుపతి(08547)స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌కు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 4, 11, 18, 25 జనవరి 1వ తేదీన తిరుపతిలో బయల్దేరే తిరుపతి–విశాఖపట్నం(08548)స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఒక థర్డ్‌ ఏసీ ఎకానమి కోచ్‌ను జతచేస్తున్నారు.

● విశాఖలో ఈ నెల 5, 12, 19, 26వ తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–చర్లపల్లి (08579) స్పెష ల్‌ ఎక్స్‌ప్రెస్‌కు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 6, 13, 20, 27వ తేదీల్లో చర్లపల్లిలో బయల్దేరే చర్లపల్లి–విశాఖపట్నం(08580)స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఒక థర్డ్‌ ఏసీ ఎకానమి కోచ్‌ను జతచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement