సీబీఐ విచారణ చేపట్టాల్సిందే..
స్టీల్ ప్లాంట్‌లోని ‘కోక్ ఓవెన్’ డిపార్టుమెంట్‌లో గత 35 సంవత్సరాల్లో ఎన్నడూ వాడని నాసిరకం కోక్‌ను వాడుతున్నారు. దీనివల్ల నాణ్యతలేని స్టీల్ ఉత్పత్తి అవుతోంది. అందుకే కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారు. ఇప్పటివరకూ నాణ్యత గల స్టీల్‌ని విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందనే బ్రాండ్ నేమ్‌ని తాత్కాలిక సీఎండీ చెడగొడుతున్నారు. నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసే కోకింగ్ కోల్ బదులు మార్కెట్‌లో నాసిరకం కోక్‌ను కమీషన్ల కోసం కొనుగోలు చేస్తున్నారు. విశాఖ ఉక్కుకు మార్కెట్‌లో ఉన్న మంచిపేరును దెబ్బతీయడానికే ఇలా వ్యవహరిస్తున్నారు.
– సీహెచ్ నర్సింగరావు, స్టీల్‌ప్లాంట్ జేఏసీ చైర్మన్,
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


