క్వాలిటీ ఇన్‌స్పెక్షన్ ఎత్తేసిన తర్వాత నుంచే..!
2024 నుంచి మిల్స్ డిపార్టుమెంట్‌లోని క్వాలిటీ ఇన్‌స్పెక్షన్ సెక్షన్‌ని ఎత్తేశారు. స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయాలని, నష్టాల్లోకి నెట్టాలని చేస్తున్న తప్పుడు చర్యల్లో ఇది ఒకటి. అప్పటి నుంచే ఉత్పత్తిలో తేడాలొచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 2025 ఏప్రిల్‌లో రూ.74 కోట్లు, మే నెలలో రూ.52 కోట్లు లాభాలు వచ్చాయి. అప్పటి వరకు రెండు బ్లాస్ట్‌ఫర్నేస్‌లతో నడిచాయి. 2025 జనవరి నుంచి జూన్ వరకు లాభాలు వచ్చాయి. 2025 జూన్ నుంచి మూడో ఫర్నేస్ ఉత్పత్తి ప్రారంభించింది. 2025 జూలైలో రూ.121 కోట్లు, ఆగస్టులో రూ.157 కోట్లు నష్టాలు తెచ్చాయి.
– ఎం జగ్గునాయుడు,
స్టీల్‌ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్


