హడలెత్తించిన కొండ చిలువ
గోపాలపట్నం: జీవీఎంసీ 92వ వార్డు బంటా కాలనీలో ఓ భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వాటర్ ట్యాంక్ సమీపంలో శనివారం కనిపించిన ఈ పామును చూసి
ఆందోళనకు గురైన కాలనీ వాసులు, వెంటనే స్నేక్ క్యాచర్ మణికంఠకు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని.. తన నైపుణ్యంతో సుమారు 12 అడుగుల కొండ చిలువ ను చాకచక్యంగా పట్టుకున్నారు. దానిని తిరిగి కొండ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ మణికంఠ మాట్లాడుతూ ఎక్కడైనా పాములు కనిపిస్తే.. 63009 36547 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


