సుస్థిరమైన, బాధ్యతాయుతమైన నిర్వహణపై చర్చ
ఐఐఎంవీలో ముగిసిన సదస్సు
తగరపువలస: గంభీరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంవీ) పదేళ్ల సంబరాల్లో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, కేస్ కాన్ఫరెన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్స్ అండ్ సస్టైనబిలిటి ప్రాక్టీసెస్–2025 సదస్సు శనివారం ముగిసింది. అకడమిక్ నిపుణులు, పరిశ్రమల నాయకులు, ఆలోచనా నేతలు సస్టైనబిలిటి, బాధ్యతాయుతమైన నిర్వహణ విధానాలపై చర్చించారు. స్థిరమైన వ్యాపార వ్యవస్థలను ప్రోత్సహించే ఆర్థిక దృష్టి కోణాలపై చర్చించారు. భారతదేశంలో సస్టైనబిలిటి పాలసీ ఫ్రేమ్‌వర్క్ మార్పుల గురించి ప్రసంగించారు. బోర్డు స్థాయిలో సరఫరా, లింకేజీ వ్యాపారాల్లో సస్టైనబిలిటీని ఏకీకృతం చేసే ఉత్తమ పద్ధతుల గురించి పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పునరావృతిని వివరించారు. దేశవ్యాప్తంగా ఈ సదస్సుకు అకడమిక్‌లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్ వందకు పైగా సమర్పణల్లో కేవలం 24 కేసులు మాత్రమే ఎంపికయ్యాయి. ఇవి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కు అనుగుణంగా రూపొందించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కేస్ కంపెడియం పుస్తకంలోని ముఖ్యాంశాలను సారాంశంగా తీసుకున్నారు. ఐఐఎంవీ రీసెర్చ్ ప్రొఫెసర్ అమిత్ శంకర్ లాభం, ప్రజలు, గ్రహం ఈ మూడింటిని సస్టైనబిలిటి మూడు స్తంభాలుగా ప్రస్తావించారు. టైమ్‌ప్రో బిజినెస్ హెడ్ శ్రీధర్ నాగరాజాచార్ మాట్లాడుతూ పరిశ్రమ, విద్యా భాగప్వామ్యం సస్టైనబుల్ వృద్ధిలో కీలకమన్నారు. సదస్సులో ప్రొఫెసర్ ఎస్.డి సుమోద్, వివిధ రంగాల నిపుణులు కౌశిక్‌రెడ్డి(ఎస్‌బీఐ), బెండపూడి విశ్వనాఽథ్(టర్నింగ్ పాయింట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ వ్యవస్థాపకుడు), రవికిరణ్ శివాలా(సన్ ఫార్మా), బి.శ్రీరామ్‌మూర్తి(భాగవతుల చారిటబుల్ ట్రస్ట్) పాల్గొన్నారు.


