త్వరితగతిన రోడ్ల పనులు
మహారాణిపేట: నగరంలో చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు డాక్ ఏరియా వరకు చేపడుతున్న రోడ్డు పనులను జీవీఎంసీ, ఎన్‌హెచ్ విభాగాల అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. పార్టనర్‌షిప్ సమ్మిట్ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఆయనతోపాటు జీవీఎంసీ సీఈ సత్యనారాయణ రాజు, ఎస్‌ఈ, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఉన్నారు.


