
విద్యుత్ విప్లవంలో స్టార్టప్‌ల కోసం హ్యాకథాన్
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరా, వినియోగంలో సరికొత్త ఆధునిక విప్లవాన్ని సృష్టిస్తూ.. డిస్కమ్‌లకు, వినియోగదారులకు ఉపయుక్తమ య్యే స్టార్టప్‌ల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలను రూపొందించే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే నెలలో హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామన్నారు. హ్యాకథాన్‌లో ఎంపికై న స్టార్టప్‌లు తమ పరిష్కారాలను రాష్ట్ర విద్యుత్ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రద ర్శించే అవకాశంతో పాటు విజేతలకు పైలెట్ ప్రాజెక్టులు, 3 డిస్క మ్‌ల్లో పూర్తి స్థాయి ప్రాజెక్టులను అమలు చేసుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ హ్యాకథాన్‌ను ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నా యన్నారు. ఈ నెల 22 రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.