
అనంతునికి పవిత్రాల సమర్పణ
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవస్వామి ఆలయంలో అనంతుని పవిత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం పవిత్రాలు సమర్పించారు. ఆలయంలోని కుంతీ మాధవస్వామి, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి చిన్న ఉత్సవ విగ్రహాలు, రుక్ష్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాల స్వామి, లక్ష్మీదేవిలకు గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామికి పవిత్రాలు సమర్పించారు. ముందుగా కుంతీ మాధవస్వామి, ఆనంత పద్మనాభ స్వాములకు అష్టకలశ స్నపనం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్రాలను సమర్పించారు.