
ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర
ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోబోం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉద్యమ టెంట్‌ను తొలగించి ఉద్యమాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించడం, ఉద్యమాన్ని లేకుండా చేయడమే పనిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
– ఆదినారాయణ, ఏఐటీయూసీ నాయకుడు