
అమ్మేయడం..తీసేయడం..
కేంద్ర ప్రభుత్వ ఆశయం, లక్ష్యం దేశంలో ప్రభుత్వ సంస్థలను అమ్మేయడం, మూసేయడం, ఉద్యోగాలను తీసేయడమే. దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి 142 కంపెనీలను అమ్ముతున్నారు. చిన్న కంపెనీలను మూసేస్తున్నారు. మైనింగ్ పేరిట కొండలు, సంపదను లాగేసుకుంటున్నారు. అడ్డుపడితే మావోయిస్టుల పేరుతో చంపేస్తున్నారు. ఇటీవల విశాఖలో మోదీ, చంద్రబాబు యోగా కార్యక్రమం నిర్వహించడానికి కారణం – తాము ఏమి చేసినా దేశ ప్రజలు అవయవాలు మూసుకుని, ఊపిరి పీల్చుకోవాలే తప్ప ప్రశ్నించకూడదు అనేదే వారి ఆశయంలా ఉంది.
– శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు