
సంపూర్ణ బంద్‌కు పిలుపు
కూటమి ప్రభుత్వం రాజ్యాంగంలోని ‘సోషలిస్ట్’ అంశాన్ని కాలరాస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలి. స్టీల్ ప్లాంట్, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి నగరంలో ఒక రోజు సంపూర్ణ బంద్ పాటించాలి. వేల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేస్తున్నప్పుడు, పేదలకు ఉచిత వైద్యం అందించే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం అన్యాయం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కమిటీ వేసి పోరాటం చేస్తే తాము తప్పకుండా పాల్గొంటాం.
– డాక్టర్ ఎన్‌ఏడీ పాల్,
ఆల్ ఇండియా బహుజన మేధావుల సమైక్య అధ్యక్షుడు.