
పాలకులు వదిలేశారు.. యువకులు సరిచేశారు
విశాఖ స్పోర్ట్స్: టీం ఇండియా భారీ స్కోరు.. కంగారూలను కలవరపెట్టడం ఖాయం అనుకున్న అభిమానులకు..ప్రొఫెషనల్ ఆటకు బ్రాండ్ మేమే అన్నట్టు ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగుల వరద సృష్టించారు. భారత బౌలర్లను చీల్చి చెండాడారు. కళ్లు చెదిరే బౌండరీలు..బంతికి చుక్కలు చూపించేలా సిక్సర్లతో మోత మోగించారు. ఆస్ట్రేలియా సారథి అలిస్సా హీలీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
రహదారులపై గుంతలు పూడ్చిన యువత
మల్కాపురం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే రోడ్లను మెరుగుపరుస్తామని, సంక్రాంతి నాటికి రోడ్లు తళతళా మెరుస్తాయని హామీ ఇచ్చింది. కానీ సంక్రాంతి, దసరా పండుగలు ముగిసి, దీపావళి వచ్చేస్తున్నా రహదారుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదు. గుంతలను పూడ్చే ప్రయత్నం కూడా చేయకపోయింది. ఈ నేపథ్యంలో రోడ్ల దుస్థితిని చూసి విసుగు చెందిన మల్కాపురం ప్రాంత యువకులు నడుం బిగించారు. తలో కొంత డబ్బులు వేసుకుని, సిమెంట్, కాంక్రీట్ కొనుగోలు చేసి ప్రమాదకరమైన గుంతలను పూడ్చి, తమ ప్రాంత ప్రజలకు తామే ఉపశమనం కలిగించారు. మల్కాపురం ప్రధాన సర్వీసు రోడ్డులో.. ముఖ్యంగా కోస్ట్ గార్డ్ కార్యాలయం వైపు వెళ్లే మార్గంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రాత్రివేళల్లో వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో యువకులే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు.

పాలకులు వదిలేశారు.. యువకులు సరిచేశారు

పాలకులు వదిలేశారు.. యువకులు సరిచేశారు

పాలకులు వదిలేశారు.. యువకులు సరిచేశారు

పాలకులు వదిలేశారు.. యువకులు సరిచేశారు