
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన అవసరం
మహారాణిపేట: మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌పై గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సతీమణి, ప్రముఖ అడ్వకేట్ దివ్య ప్రసాద్ అన్నారు. ‘పింక్ మంత్’ భాగంగా కేజీహెచ్‌లో మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శిల్ప ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి మహిళ ఏడాదికి ఒకసారి విధిగా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని దివ్య ప్రసాద్ కోరారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనతో పాటు మెమోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలను కేజీహెచ్‌లో ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా సకాలంలో నయం చేయవచ్చని రేడియాలజీ విభాగతకి డాక్టర్ కె. బుజ్జి బాబు పేర్కొన్నారు.