
ఏయూ రెక్టార్‌గా ఆచార్య కింగ్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్‌గా కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యులు పులిపాటి కింగ్ నియమితులయ్యారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ బుధవారం ఆచార్య కింగ్‌కు నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆచార్య కింగ్ రెక్టార్‌గా బాధ్యతలు స్వీకరించారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యులుగా ఉన్న ఆచార్య కింగ్ గతంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా, కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా తదితర పదవులను నిర్వహించారు. ఆయన ఏయూ నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ అకడమీషియన్ అవార్డును, అమెరికాకు చెందిన అండన్ ఫౌండేషన్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య కింగ్‌కు వర్సిటీ ఆచార్యులు శుభాకాంక్షలు తెలిపారు.