
డీఎస్పీ కారుకే ఫొటో తీస్తావా?
విశాఖ సిటీ: డీఎస్పీ కారుకే ఫొటో తీస్తావా? నీ ఉద్యోగం తీయిస్తా.. అంటూ ఓ కారు డ్రైవర్ కానిస్టేబుల్‌పై విరుచుకుపడ్డాడు. బుధవారం సంపత్ వినాయగర్ ఆలయం రోడ్డులో కారును నిలిపారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుపైనే కారు నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ముందుకు వెళ్లాలని కానిస్టేబుల్ సూచించాడు. అందుకు కారు డ్రైవర్ అంగీకరించలేదు. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కానిస్టేబుల్ కారుకు ఫొటో తీశాడు. వెంటనే డ్రైవర్ రెచ్చిపోయాడు. డీఎస్పీ కారుకే ఫొటో తీస్తావా? అంటూ ఒంటికాలిపై లేచాడు. నీ ఉద్యోగం తీయిస్తా అంటూ హెచ్చరించడం గమనార్హం.