
పత్రికా స్వేచ్ఛకు భంగం
జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు లేదా పరువు నష్టం దావా వేయవచ్చు. అంతేగానీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయలేదు. ఈ విధమైన వైఖరి వల్ల జర్నలిస్టులు సరైన వార్తలు పాఠకులకు అందించలేరు. వాస్తవాలను రాయడానికి, నిజానిజాలు వెల్లడించడానికి వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల స్వేచ్ఛకు ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఆలోచన చేయాలి. – గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి

పత్రికా స్వేచ్ఛకు భంగం