
భారత అంధుల క్రికెట్ జట్టులో విశాఖ అమ్మాయి
విశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నానికి చెందిన పొంగి కరుణకుమారి భారత్‌లో తొలిసారిగా జరగనున్న మహిళల టీ–20 ప్రపంచ అంధుల క్రికెట్ కప్‌లో ఆడనుంది. నవంబర్ 11 నుంచి 25 వరకు న్యూఢిల్లీ, బెంగళూరులలో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, అమెరికా దేశాలతో పాటు భారత్ కూడా పాల్గొంటోంది. టోర్నమెంట్ విజేతను నిర్ణయించడానికి లీగ్ దశలో 21 మ్యాచ్‌లు, ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన కరుణకుమారి ప్రస్తుతం విశాఖలోని ప్రభుత్వ అంధుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.