విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు | - | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

Sep 12 2025 5:52 AM | Updated on Sep 12 2025 5:52 AM

విశాఖ

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

భయం వేసింది

నేను మా ఆవిడ, కోడలు, మా బఽంధువులు కలిపి మొత్తం మొత్తం 18 మంది ఈనెల 3న నేపాల్‌ బయలుదేరి వెళ్లాం. 5న అక్కడికి చేరుకున్నాం. ముక్తినాథ్‌, పశుపతినాఽథ్‌ తదితర ఆలయాలతో పాటు పలు ప్రాంతాలను సందర్శించాం. 9న ఖాట్మాండ్‌ వచ్చాం. అప్పటికే అక్కడ తీవ్రమైన అల్లర్లు చోటుచేసుకోవడంతో భయాందోళన చెందాం. అక్కడ మేము బస చేసిన హోటల్‌ యజమాని మమ్మల్లి లోపల ఉంచి గేట్లకు తాళాలు వేశారు. తిరిగి సింహాచలం వస్తామో లేదో అని భయం వేసింది. ఎట్టకేలకు అక్కడ ప్రత్యేక విమానం ఎక్కి గురువారం రాత్రికి విశాఖ చేరుకున్నాం.

– సిరిపురపు రమణ, సింహాచలం

గోపాలపట్నం : తీర్థయాత్రలకు వెళ్లి నేపాల్‌లో చిక్కుకున్న బాధితులు గురువారం విశాఖ చేరుకున్నారు. ఖట్మాండ్‌ నుంచి ప్రత్యేక విమానంలో మొత్తం 144 మంది విశాఖ వచ్చారు. ఇందులో 42 మంది విశాఖ ప్రాంతంవారు, 40 మంది రాయలసీమ, 34 మంది విజయనగరం, మిగిలిన వారంతా శ్రీకాకుళానికి చెందినవారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన 40 మందిని ఇక్కడి నుంచి తిరుపతికి వేరే విమానంలో పంపించారు. మిగతా 104 మందిని ప్రత్యేక వాహనాల ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. వారికి విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, తదితరులు స్వాగతం పలికారు.

హోటల్‌లోనే ఉండిపోయాం..

తీర్థయాత్రలకు వెళ్లి అన్ని ప్రాంతాలు చూశాం.. నేపాల్‌ నుంచి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మేమంతా హోటల్‌లోనే ఉండిపోయాం. హోటల్‌ యజమాని మానవతా దృక్పథంతో మమ్మల్ని ఆదుకున్నాడు. ఫ్రీగా భోజనాలు పెట్టించాడు. అయితే మాతో వచ్చినవారు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అందరం మళ్లీ కలుస్తామా.. ఇంటికి వెళ్లగలమా.. అని ఆందోళన చెందాం. బిక్కుబిక్కుమంటూ గడిపాం. దేవుడు దయ వల్ల విశాఖ చేరుకున్నాం.

– ఎయిర్‌పోర్టులో నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 1
1/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 2
2/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 3
3/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 4
4/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 5
5/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 6
6/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 7
7/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు 8
8/8

విశాఖ చేరుకున్న నేపాల్‌ బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement