
భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం.. రాజ్యాంగ విరుద్ధం
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు, టీవీలు వ్యవహరిస్తుంటాయి. పాత్రికేయులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తుంటారు. తప్పులు సరిదిద్దుకోవాలి గానీ రాసిన పత్రికపై, పాత్రికేయులపై కక్ష కడితే ఎలా? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్‌మీట్‌ను వార్తగా రాస్తే.. ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై, సంబంధిత జర్నలిస్టుపై అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి వేధించే ధోరణి అవలంబిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. – డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ, అనకాపల్లి

భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం.. రాజ్యాంగ విరుద్ధం