
ఇసుకే అయినా.. మట్టిదిబ్బలని...
పూర్వ కాలంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగానూ పిలిచేవారు. పాయలుగా ఏర్పడిన తర్వాత.. ఎర్రమట్టి దిబ్బలుగా పిలుస్తున్నారు. వాస్తవానికి భౌగోళిక పరంగా ఇది ఇసుక నుంచి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒక చోట చేరిన ఇసుక రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారుతాయి. అలా ఒకచోట పేరుకుపోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా అనిపించే విధంగా మారుతుంది. ఇది ఇసుకే అయినా మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దిబ్బల్లోని ఇసుక, మట్టి ఎరుపు రంగులో ఉండటం వల్ల వీటిని ఎర్రమట్టి దిబ్బలుగా పిలవడం అలవాటైపోయింది.