
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రెస్ మీట్‌లో నాయకుడు ఇచ్చిన వార్తను ప్రచురిస్తే కేసులు పెట్టడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం ఈ రాష్ట్రంలో లేదా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది. రాజకీయ పార్టీ నేత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్‌పై కేసులు పెడతారా? భావ ప్రకటన స్వేచ్ఛను అక్రమ కేసులు, నోటీసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షతో సాక్షి ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. రాష్ట్రంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం తప్పదు. – డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎంపీ, అరకులోయ