
కురిసిందీ.. వానా
సాక్షి, విశాఖపట్నం : వరుణుడు కరుణించాడు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం.. విశాఖ నగరంపై పడింది. ప లు చోట్ల భారీ వర్షం.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కాలేజీలు, స్కూల్స్, కార్యాలయాలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో విద్యార్థులు, ఉద్యోగులు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రహదారులపై నీరు నిలవడంతో.. ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకప్పుడు ఎంత వర్షం కురిసినా 15 నిమిషాల్లో నగరంలో వరదనీరు కనిపించేది కాదు. కూటమి ప్రభు త్వం పారిశుధ్య నిర్వహ ణని గాలికొదిలెయ్యడంతో.. మురుగు కాలువలు, గెడ్డలు పూడికతో నిండిపోయి.. వరదనీరు పారేందుకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడటంతో.. రోడ్లపైనే నీరు నిలిచిపోతోంది. దీంతో.. నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం వరకూ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నేడు కేంద్ర మంత్రి రాక
మహారాణిపేట: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జే.పీ.నడ్డా శనివారం విశాఖ వస్తున్నారు. బిహార్ నుంచి విమానంలో శనివారం రాత్రి 8.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నోవోటెల్ హోటల్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 14న విశాఖ రైల్వే స్టేడియం గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విమానంలో ఢిల్లీ వెళ్తారు.
దుర్గాదేవి విగ్రహాల తయారీలో బిజీగా కళాకారులు
నగరంలో దుర్గాదేవి మహోత్సవాల సందడి అప్పుడే మొదలైంది. రాబోయే దేవీ నవరాత్రుల కోసం నగరంలోని పలు ప్రాంతాలలో దుర్గామాత విగ్రహాల తయారీ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా లాసన్స్ బే కాలనీ, కంచరపాలెం వంటి ప్రాంతాల్లోని కార్మికులు, కళాకారులు విగ్రహాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల కోసం చిన్న విగ్రహాల నుంచి భారీ ప్రతిమల వరకు ఇక్కడ తయారవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో పాటు, స్థానిక నిపుణులు విగ్రహాల తయారీలో పాలుపంచుకుంటున్నారు. ఒండ్రుమట్టి, గడ్డి, వెదురు వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో అమ్మవారి విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చే దుర్గా మాతను ప్రతిష్టించేందుకు నగరంలోని పలు పూజా కమిటీలు, యువజన సంఘాలు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేశాయి. ఈ విగ్రహాల తయారీ కేంద్రాలు పండగకు ముందే నగరంలో ఆధ్యాత్మిక, పండగ శోభను తీసుకొచ్చాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
భక్తి పారవశ్యం..
కళా నైపుణ్యం
నేడు మెగా లోక్ అదాలత్
ఉమ్మడి విశాఖ జిల్లాలో 36 బెంచీల ఏర్పాటు
విశాఖ లీగల్: ఉమ్మడి విశాఖ జిల్లాలో శనివారం నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా ల్లోని అన్ని న్యాయస్థానాల్లో ఈ మెగా లోక్ అదాలత్ జరగనుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారం కోసం దాదాపు 6,000 కేసులు గుర్తించామని, వీటిని పరిష్కరించడానికి 36 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. నేర శిక్షాస్మృతి పరిధిలోని రాజీ అయ్యే కేసులు, పౌర శిక్షాస్మృతిలోని కేసులు, బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన సివిల్ వివాదాలు, కుటుంబ న్యాయస్థానం పరిధిలోని కేసులను పరిష్కరిస్తామని వెల్లడించారు. తమ కేసులను రాజీ చేసుకోవాలనుకునే వారు న్యాయ సేవ ప్రాధికార సంస్థలను సంప్రదించాలని ఆయన సూచించారు.
ప్రాంతం కురిసిన వర్షం
(మి.మీలో)
మహారాణిపేట 51.2
సీతమ్మధార 48.8
ఆరిలోవ 30.8
పెదగంట్యాడ 12.2
ములగాడ 10.2
గోపాలపట్నం 4.2
గాజువాక 4.0
ఆనందపురం 2.0
పెందుర్తి 1.0

కురిసిందీ.. వానా

కురిసిందీ.. వానా

కురిసిందీ.. వానా

కురిసిందీ.. వానా

కురిసిందీ.. వానా

కురిసిందీ.. వానా

కురిసిందీ.. వానా