23 నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

23 నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

Sep 11 2025 6:26 AM | Updated on Sep 11 2025 6:26 AM

23 నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

23 నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

సింహాచలం: ఈ నెల 23 నుంచి అక్టోబరు 1 వరకు సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు బుధవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఆలయంలో శ్రీ రామాయణ నవరాత్ర పారాయణం ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం 5 గంటలకు చతుర్భుజ తాయారు, సువర్ణ అమ్మవార్లకు ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న సింహవల్లీ తాయారు సన్నిధిలో వీరలక్ష్మీ ఆరాధనం, 29న మూల నక్షత్రం పురస్కరించుకుని ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 2 విజయదశమి నాడు కొండదిగువ పూలతోటలో సాయంత్రం నుంచి జమ్మివేట ఉత్సవం, శమీపూజ జరపనున్నట్లు తెలిపారు. ఆ రోజు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి శ్రీరామాలంకారం చేసి కొండపైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువ పూలతోటకు తీసుకెళ్తామన్నారు. విజయదశమి నాడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపై స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement