
సంద్రంపై మెరుపుల నృత్యం
సముద్రపుటంచున నిలబడి చూస్తే, ఆకాశం తన మేఘపు మేలి ముసుగులో కళ్లు మూసుకుంది. అలల వెచ్చని
స్పర్శకు పులకించిన సంద్రం... ఆకాశం కళ్లు తెరిచే క్షణం కోసం వేచి చూసింది. అంతలోనే ఉరుముల శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ మెరుపు పుట్టింది. అది ఆకాశం నుంచి సంద్రం వైపు దూకింది. ఆ మెరపు స్పర్శకు సంద్రం మురిసిపోయింది. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనంతమైన మెరుపులు ఆకాశం నుంచి సముద్రంలో దూకాయి. అప్పుడు ఉరుముల సవ్వడికి భూమి పరవశించిపోయింది. సముద్రంలో తళతళ మెరిసిన మెరుపులు, వర్షపు చుక్కల జల్లుతో ఆకాశం సంద్రంపై ప్రేమను కురిపించింది. ఆ అద్భుత దృశ్యానికి విశాఖ ఆర్కే బీచ్ వేదికై ంది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

సంద్రంపై మెరుపుల నృత్యం