ముగిసిన ఫుడ్‌ ఫెస్టివల్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఫుడ్‌ ఫెస్టివల్‌

Sep 8 2025 5:16 AM | Updated on Sep 8 2025 5:16 AM

ముగిసిన ఫుడ్‌ ఫెస్టివల్‌

ముగిసిన ఫుడ్‌ ఫెస్టివల్‌

ఆరిలోవ: బీచ్‌రోడ్డులోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఫుడ్‌ ఫెస్టివల్‌ ఆదివారంతో ముగిసింది. ఏపీ టూరిజం, హెచ్‌ఆర్‌ఏఏపీ, టూరిజం అండ్‌ ట్రావెల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ, వీహెచ్‌ఎంఏ, ఈఎంఏ, ఏపీ చాంబర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5న ఈ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఫెస్టివల్‌లో భాగంగా 45కు పైగా ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయగా, మూడు రోజుల్లో వేలాది మంది సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది 2026లో మరింత ఎక్కువ స్టాల్స్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, టూరిజం శాఖ అధికారులు జె.మాధవి, జగదీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement