
దడ
ధరలు
రైతు బజార్లుండి
ఏం ప్రయోజనం
ఒక్క పూట ఇంట్లో అందరికీ కూరవండుకోవాలంటే రూ.100లు పెట్టి కూరగాయలు కొనాల్సి వస్తోంది. మొన్న ఉన్న రేటు, ఈ రోజు ఉండటం లేదు. పచ్చిమిర్చి, టమాటా అయితే మరీ దారుణం. పావుకిలో పచ్చిమిర్చి రూ.30లు పెట్టి కొనాల్సి వచ్చింది. ఇలా అయితే మాలాంటోళ్లం ఎలా బతకాలి. రైతుబజార్లు ఉండి, ఏం ప్రయోజనం. ప్రభుత్వం పట్టించుకోవాలి. – ఫాతిమా, లక్ష్మీనగర్
వ్యాపారుల
నిర్ణయించిందే ధర
హోల్‌సేల్ మార్కెట్లోనే ధరలు అధికంగా ఉంటున్నాయి. పెద్ద వ్యాపారస్తులు పెట్టిన రేటుకు కూరగాయలు కొనితెచ్చుకుంటున్నాం. పచ్చిమిర్చి దొరకటం లేదు. క్రేట్లలో వస్తున్న టమాటా కుళ్లిపోతోంది. దీని వల్ల మాకే నష్టం వస్తోంది. అందుకే రేటు పెంచి విక్రయిస్తేనే కానీ, మాకు గిట్టుబాటు కావటం లేదు. హోల్ సేల్ మార్కెట్లో ధరలకు నియంత్రం ఉండేలా అధికారులు చూడాలి.
–ఆర్.మల్లికార్జున రావు, దుకాణదారుడు
కూరగాయల ధరలు
(సోమవారం ధరలు కిలో.రూ.లు)
రైతు బయట
బజార్ దుకాణాల్లో
పచ్చి మిర్చి రూ.72 రూ.120
టమాటా రూ.45 రూ.60
ఉల్లిపాయలు రూ.21 రూ.40
దొండకాయలు రూ.28 రూ.80
బీరకాయలు రూ.32 రూ.70
వంకాయ రూ.38 రూ.80
●
సీతమ్మధార రైతుబజార్‌లో టమాటాలు
కొనుగోలు చేస్తున్న వినియోగదారులు
విశాఖ విద్య: కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పది రోజుల క్రితం రూ. 60 ఉన్న పచ్చిమిర్చి ప్రస్తుతం రూ. 120కి చేరింది. వంకాయలు, దొండకాయలు, బీరకాయలు వంటి అన్ని రకాల కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీంతో ధరలకు అదుపు లేకుండా పోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కూటమి ప్రభుత్వ పాలనలో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని’ ప్రజానీకం బెంబేలెత్తుతోంది. ధరలను నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ ధరల పెరుగుదల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి నాయకులే మధ్య దళారులుగా వ్యవహరిస్తున్నారని, అందుకే మార్కెట్‌లో జరుగుతున్న ఈ మాయాజాలాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.
రైతు బజార్లకు నాణ్యత లేని సరుకులు
నగర ప్రజలకు కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులను నిర్ణీత ధరలకు అందించే లక్ష్యంతో జిల్లాలో 13 రైతు బజార్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడికి నాణ్యత లేని సరుకులు సరఫరా అవుతున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. రైతు బజార్లలో విక్రయించే ఉల్లిపాయలు కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నాయని, ఇంటికి తెచ్చుకున్న రెండు రోజులకే పాడైపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో అధిక ధరలు చెల్లించి బయటి మార్కెట్లలోనే అన్ని రకాల కూరగాయలు కొనాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.
టమాటా సరఫరాలో ప్రభుత్వ వైఫల్యం
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్ నుంచి నగరానికి టమాటా సరఫరా అవుతుంది. ప్రతిరోజూ సుమారు 200 టన్నుల టమాటా వస్తుంది. ఇందులో పాడైన టమాటాను రైతు బజార్ల దుకాణదారులకు అంటగట్టి, మంచివి బయటి మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించేందుకు వ్యాపారులు పథకం వేస్తున్నారు. కుళ్లిన టమాటా సరఫరా అవుతుండటంతో తమకు నష్టం వస్తోందని రైతు బజార్ల దుకాణదారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం టమాటోను కొనుగోలు చేసి రైతు బజార్లకు సరఫరా చేసేది. కానీ ప్రస్తుతం వ్యాపారులే పెత్తనం చెలాయిస్తుండటంతో ప్రజలకు ధరల భారం తప్పడం లేదు.
పర్యవేక్షణాధికారుల కొరత
రైతు బజార్లపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన యాసిన్‌ను బదిలీ చేసినా, ఆ స్థానంలో ఇంకా ఎవరూ విధుల్లో చేరలేదు. డిప్యూటీ డైరెక్టర్ ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. రైతు బజార్లలో ఏం జరుగుతుందో పర్యవేక్షించేవారు లేకపోవడంతో వినియోగదారులకు అవి ఉపయోగపడటం లేదు. ఫలితంగా, బయటి మార్కెట్‌లో ధరల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
కూర ‘గాయాలు’
ఘాటెక్కిన పచ్చిమిర్చి, కిలో రూ.120లు
రైతు బజార్లకు కుళ్లిన టామాటో సరఫరా
బయట మార్కెట్‌లో కేజీ రూ.60
కృత్రిమ కొరత సృష్టిస్తొన్న వ్యాపారులు
ధరల అదుపుపై దృష్టి పెట్టని
కూటమి ప్రభుత్వం

దడ

దడ

దడ