
బుసకొట్టి డిమాండ్ చేస్తున్నాం.. సమస్యలు పరిష్కరించమని.
జీవీఎంసీ ఆఫీస్ ప్రాంగణం సాధారణంగా ఉండే బూజు వాసనలకు బదులుగా, మా స్నేహితుల బుసబుసలు, మొరుగుళ్లతో దద్దరిల్లింది. అధికారిక సమావేశాల బోరింగ్ మాటలకు బదులు, మా వాళ్లే స్టేజ్‌పైకి వచ్చారు. మొదటగా మా అన్న స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్‌కుమార్, మా పాములందరికీ నీళ్లిస్తూ నిరసన తెలిపాడు. ఆ వేడిలో కాస్త చల్లగా అనిపించినా, అన్న కష్టం మాకు అర్థమైంది. మమ్మల్ని పట్టుకుని, సురక్షితంగా మరో చోట వదిలేసే అన్నకు సరైన గుర్తింపు లేదని మాకు తెలుసు. ఆ తర్వాత వీధిలో మా జాగిలా బంధువులను పట్టి నగరాన్ని కాపాడుతున్నామని చెప్పే వెటర్నరీ కార్మికులు, వాళ్ళతోపాటు మా జాగిల స్నేహితులను కూడా తెచ్చారు. మేం చూస్తూ ఉండగానే, జీవీఎంసీ కార్యాలయం అక్షరాలా మా జంతువుల అడ్డాగా మారిపోయింది.
ఎందుకీ వింత ప్రదర్శన?
ఇదంతా మా వెటర్నరీ కార్మికుల దీర్ఘకాల డిమాండ్ వల్లనే. జీవీఎంసీ కౌన్సిల్ వాళ్ల కోసం ఏదో జీవో నంబరు 36 అని ఒక తీర్మానం చేసిందట. దాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వాళ్లు జీవీఎంసీ ప్రధాన గేటు దగ్గర నిరసన తెలిపారు. తర్వాత జీవీఎంసీ సీపీఎం లీడర్ డాక్టర్ బి.గంగారావు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, మేయర్‌కు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సోమవారం.. పీజీఆర్‌ఎస్ మనుషుల వినతులకే కాదు, మా జంతువుల ఉనికిని, మా మిత్రుల గోడును కూడా తెలియజేసింది.
– డాబాగార్డెన్స్

బుసకొట్టి డిమాండ్ చేస్తున్నాం.. సమస్యలు పరిష్కరించమని.