
నేడు, రేపు హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్
ఏయూ క్యాంపస్: వివాహాలకు అవసరమైన విభిన్న మోడళ్ల ఆభరణాలతో కూడిన రెండు రోజుల హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ శని, ఆదివారాలు నోవాటెల్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో భాగంగా వివాహ సందర్భాల్లో వధువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఆభరణాలు అందుబాటులో ఉంటాయన్నారు. డిజైనర్‌ల చేతిలో రూపుదిద్దుకున్న ఫ్యాషన్ ఆభరణాలు మహిళల అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయన్నారు. భారత దేశవ్యాప్తంగా పేరుగాంచిన డిజైనర్లు తాము తయారు చేసిన ఆభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. వివాహ ఫ్యాషన్‌కు తగినట్టుగా ప్రతి ఆభరణం ఎంతో నైపుణ్యంతో డిజైన్ చేసి, తయారు చేసి విశాఖ వాసుల కోసం ఇక్కడి ప్రదర్శనలో ఉంచుతున్నట్లు వెల్లడించారు.