
విశ్వదాత పురస్కారం అందుకున్న గంట్ల
విశాఖ సిటీ: విశాఖకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు జాతీయ స్థాయి విశ్వదాత పురస్కారం అందుకున్నారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, ఎమ్మెల్యే వర్లకుమార్‌రాజా చేతుల మీదుగా గంట్లకు పురస్కారాన్ని అందజేశారు. వేద మంత్రాల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అవార్డును పొందడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయీ అవార్డుల కంటే కాశీనాథుని పురస్కారం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు.