నేను పీకే తాలుకా..తలచుకుంటే లేపేస్తా...! | - | Sakshi
Sakshi News home page

నేను పీకే తాలుకా..తలచుకుంటే లేపేస్తా...!

May 10 2025 2:16 PM | Updated on May 10 2025 2:16 PM

నేను పీకే తాలుకా..తలచుకుంటే లేపేస్తా...!

నేను పీకే తాలుకా..తలచుకుంటే లేపేస్తా...!

● ఓ వైద్యుడిపై పవన్‌ కల్యాణ్‌ అభిమాని వీరంగం ● ప్రశ్నించినందుకు దౌర్జన్యం

డాబాగార్డెన్స్‌ : నేను పవన్‌ కల్యాణ్‌ తాలూకా? నీవెవ్వడివిరా? నేను తలచుకుంటే లేపేస్తా.’ అంటూ ఓ వైద్యుడిపై పీకే అభిమాని విరుచుకుపడ్డాడు. ఆ వైద్యుడు కన్నీటితో తన ఆవేదనను సాక్షి వద్ద వెలిబుచ్చాడు. ఏం జరిగిందో ఆయన మాటల్లోనే..పాతనగరం ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద హోమియో క్లినిక్‌ నడుపుతున్నా. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో క్లినిక్‌ మూసి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అభాగ్యురాలు తన చంటి పిల్లలతో మండుటెండలో ఆకలితో అలమటిస్తుంటే.. బిస్కెట్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఇచ్చాను. ఆనందంగా స్వీకరించిన పిల్లలు సమీపంలోని మరిడిమాంబ ఆలయం షెల్టర్‌ వద్దకు తినుకుంటూ వెళ్లడంతో ఓ ద్విచక్రవాహనదారుడు స్పీడ్‌గా వచ్చి సడన్‌ బ్రేక్‌ వేశాడు. ‘ఎందుకు అంత స్పీడ్‌? ఇది వీధి కదా.. కొంచెం నెమ్మదిగా వెళ్లొచ్చు కదా.. అని ప్రశ్నించా..అంతే ఆ యువకుడు రెచ్చిపోయి.. ‘నేను పవన్‌ కల్యాణ్‌ తాలూకా.. నీవెవ్వడివిరా నన్ను ప్రశ్నిస్తున్నావ్‌? నేను తలచుకుంటే లేపేస్తా’ అంటూ దౌర్జన్యం చేశాడని డాక్టర్‌ రియాజ్‌ అహ్మద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

స్పీడ్‌ బ్రేకర్లు వేసుంటే సమస్యే ఉండేది కాదు..

ఈ ప్రాంతంలో ఓ వైపు మరిడిమాంబ ఆలయం.. కొంత దూరంలో యాసీన్‌ బాబా దర్గా ఉన్నాయి. ఇటు మరిడిమాంబ ఆలయానికి వెళ్లే భక్తులు, యాసీన్‌ బాబా దర్గాకు వచ్చే ముస్లింలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇటు గుండానే వెళ్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్తున్న నేపథ్యంలో స్పీడ్‌ బ్రేకర్లు వేయాలని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్‌ రియాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement