
విశాఖ డెయిరీ పాల ధరల పెంపు
అక్కిరెడ్డిపాలెం: విశాఖ డెయిరీ పాల ధరలను పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(500 మి.లీ) రూ.25 నుంచి రూ.26కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(లీ) రూ.50 నుంచి రూ.52కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు(లీ) రూ.54 నుంచి రూ.56కు, టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, స్టాండర్డైజ్డ్ పాలు(500 మి.లీ) రూ.30 నుంచి రూ.31కు, ఫుల్ క్రీమ్ పాలు (500 మి.లీ) రూ.32 నుంచి రూ.33కు, ఫుల్ క్రీమ్ పాలు (లీ) రూ.63 నుంచి రూ.66కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు–గంగ (500 మి.లీ) రూ.28 నుంచి రూ.29కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు–గంగ(500 మి.లీ) రూ.26 నుంచి రూ.27కు, టోన్డ్ పెరుగు (180 గ్రా.) రూ.14 నుంచి రూ.15కు, టోన్డ్ పెరుగు (కిలో) రూ.64 నుంచి రూ.66కు, డబుల్ టోన్డ్ పెరుగు (900గ్రా.) రూ.54 నుంచి రూ.56కు పెరిగినట్లు యాజమాన్యం తెలిపింది.