రైతులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు అప్రమత్తంగా ఉండాలి

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

పరిగి: చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ రజిత సూచించారు. సోమవారం ఆమె అటవీ శాఖ అధికారులతో కలిసి నస్కల్‌ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుత పులిని గుర్తించేందుకు అధికారులు నాలుగు ట్రాప్‌ కెమెరాలు, ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొలాలకు వెళ్లిన రైతులు చీకటి పడే లోపు ఇళ్లుకు చేరుకోవాలని సూచించారు. ఒంటరిగా పొలాలకు వెళ్లరాదన్నారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో కట్టివేయాలని తెలిపారు. పులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఎవరూ భయాందోళన చెందరాదని సూచించారు. ఆమె వెంటఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ తదితరులు ఉన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement