పశుగ్రాస సాగును ప్రోత్సహించండి | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాస సాగును ప్రోత్సహించండి

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

అనంతగిరి: వీబీజీ రామ్‌జీ పథకం కింద రైతులు పశుగ్రాసం సాగు చేయాలని అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వీబీజీ రామ్‌జీ పనులు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో నేపథ్యంలో పశుపోషణకు ఇబ్బంది కలగకుండా పశుగ్రాసం సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ, మహిళా సంఘాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఇంకుడు గుంతలు, పామ్‌ పాండ్స్‌, బోర్‌ వెల్‌ రీచార్జ్‌ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనులను చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్‌డీఓ నర్సింగ్‌ రావు, డీపీఓ జయసుధ, పంచాయతీ రాజ్‌ ఈఈ ఉమేష్‌, జిల్లా పశువైద్యాధికారి సదానందం, నీటి పారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.

బీమాతో సామాజిక భద్రత

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ సూచించారు. సోమవారం వికారాబాద్‌ మండలం సిద్దలూరు, మున్సిపల్‌ పరిధిలోని దన్నారం గ్రామాల్లో బీమా పథకంలో భాగంగా అభ్యర్థుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత లభిస్తుందన్నారు. పథకంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, ఎంపీడీఓ వినయ్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement