పరిగి: పరిశ్రమల కోసం భూములిచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. సోమవారం మండలంలోని రాపోల్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో 610.08 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. 509 ఎకరాల అసైన్డ్ భూమి, 101.08 ఎకరాల పట్టా భూముల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల విన్నపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఒక్కో ఎకరాకు ప్రభుత్వం రూ.35 లక్షలు ప్రకటించిందని, పునరావాసం కోసం రూ.5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేఽశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి


