మర్పల్లి: మండల కేంద్రంలోని మర్రి చెన్నారెడ్డి వ్యవసాయ పొలంలో ఆదివారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్న 11 మందిని టాస్క్‌ఫోర్స్, మర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.37,940 నగదు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐఎండీ రవూఫ్ తెలిపారు.
చికిత్స పొందుతూ
కానిస్టేబుల్ మృతి
పరిగి: చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందిన ఘనట మండలంలోని రూప్‌ఖాన్‌పేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లముసిలి నర్సింహులు(38) నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితం అనారోగ్యనికి గురై ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భర్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని చల్లంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సాలార్‌పూర్ గ్రామానికి చెందిన గోపాల్, హన్మానాయక్, మల్లేశ్ కలిసి మేసీ్త్ర పనుల నిమిత్తం సోమవారం సాలార్‌పూర్ గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై కడ్తాల్‌కు వస్తున్నారు. మార్గమధ్యలో చల్లంపల్లి సమీపంలో కడ్తాల్ నుంచి చల్లంపల్లి వైపు వెళ్తున్న ఆటో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న గోపాల్, హన్మానాయక్, మల్లేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కడ్తాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమీర్‌పేటలో సందడి చేసిన
సినీనటుడు విజయ్ ఆంటోని
అమీర్‌పేట: ‘బిచ్చగాడు’ సినిమా హీరో విజయ్ ఆంటోని అమీర్‌పేటలో సందడి చేశారు. సోమవారం సాయంత్రం సత్యం మాల్ చౌరస్తాలోని అమోగా హోటల్‌కు ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి టీ మస్కాబన్ తిన్నారు. హోటల్‌లో ఉన్న సందర్శకులు ముందుగా గుర్తు పట్టలేదు. అభిమానులు గుర్తుపట్టి మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఈ హోటల్‌లో చాయ్ ఫేమస్ అని వచ్చానని విజయ్ ఆంటోని తెలిపారు.


