అభివృద్ధిలో పోటీపడండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో పోటీపడండి

Oct 10 2026 7:56 AM | Updated on Oct 10 2026 7:56 AM

● ఆరు నెలల్లో ‘కేపీ లక్ష్మీదేవిపల్లి’ని పూర్తి చేస్తాం ● డబుల్‌ రోడ్డు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పూడూరు: అధికారులు, ప్రజాప్రతినిథులు సమన్వయంతో పని చేసి మండల అభివృద్ధి కి పాటు పడా లని పరిగి ఎమ్మె ల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవా రం పూడూరులో మండల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభం కాని వాటిని ఇతరులకు కేటాయించాని హౌసింగ్‌ అధికారులకు సూచించారు. కంకల్‌ నుంచి లాల్‌పహాడ్‌ వరకు డబుల్‌ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అంగడిచిట్టంపల్లి – కంకల్‌ డబుల్‌ రోడ్డుకు టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలన్నారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని పలువురు సర్పంచ్‌లు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సాగుకు సరిపడా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. జలసిరి పథకంలో భాగంగా బోర్ల, బావుల వద్ద ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించుకోవాలని తెలిపారు. ఆరు నెలల్లో కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తవుతుందని, దీంతో నీటి కొరత ఉండదన్నారు. నిజాంపేట్‌ మేడిపల్లి నుంచి రంగాపూర్‌ వరకు డబుల్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయని, విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోనున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎల్‌నినోను దృష్టిలో పెట్టుకుని నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు కావాల్సినన్ని నిధులు ఇస్తామని అభివృద్ధిలో పోటీ పడాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, ఆత్మ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రఘునాథ్‌రెడ్డి, ఎంపీడీఓ పాండు, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కిజర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement